నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
ప్రముఖ రాజకీయ నాయకులు కీ “శే ” జిట్టా బాలకృష్ణారెడ్డి జ్ఞాపకార్థంగా, జిట్టా యువసేన నాయకులు సేవర్తి మధు ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మర్యాల గ్రామంలోని పదవ తరగతి విద్యార్థులకు పరీక్షల శుభాకాంక్షలు తెలియజేస్తూ, పరీక్షా ప్యాడ్లు, పెన్స్, పెన్సిల్స్, స్కేలు, హాల్ టికెట్ కవర్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా సేవర్తి మధు మాట్లాడుతూ..నేను ఈ పాఠశాలలోనే చదువుకున్నాను. ఉడుత భక్తితో ఈ చిన్న కార్యక్రమం నిర్వహించడం నాకు ఎంతో ఆనందంగా ఉందనారు. విద్యార్థులు కృషి, పట్టుదలతో చదివి మంచి ఫలితాలు సాధించాలని కోరారు. జిట్టా బాలకృష్ణారెడ్డి పేద విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం భువనగిరి పట్టణంలో తన మేనమామ సహకారంతో సి ఎస్ ఎన్ ఆర్ ఇంటర్ కళాశాల స్థాపించారని గుర్తు చేశారు. వారి సేవా స్ఫూర్తిని, ఆశయాలను కొనసాగిస్తూ విద్యార్థుల అభ్యున్నతికి ఎల్లప్పుడూ తోడ్పాటుగా ఉంటాం” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ పగిడిపల్లి నిర్మలా జ్యోతి ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాల్గొన్నారు.


