నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని ఉప్లూర్ గ్రామంలో ఇద్దరూ లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జి ముత్యాల సునీల్ రెడ్డి ద్వారా మంజూరైన చెక్కులను మంగళవారం పంపిణీ చేశారు. అనారోగ్యంతో ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం చేయించుకున్న లబ్ధిదారులు ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు చేసుకున్నారు.గ్రామానికి చెందిన కొమ్ముల వెంకట్ రూ.52వేలు, సాధుల గంగాధర్ రూ.14వేల 500 ఆర్థిక సహాయం చెక్కులను ప్రభుత్వం మంజూరు చేసింది.
ఈ చెక్కులను కాంగ్రెస్ పార్టీ నాయకులు లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి అందజేశారు. ఆర్థిక సహాయం చెక్కుల మంజూరుకు కృషిచేసిన ముత్యాల సునీల్ రెడ్డికి లబ్ధిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తిప్పిరెడ్డి శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి తక్కురి దేవేందర్, మాజీ సర్పంచ్ బద్దం రమేష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కొమ్ముల రవీందర్, బోనగిరి లక్ష్మణ్, మారుపక నరేష్, బద్దం నాగేష్, సరసం చిన్నారెడ్డి, కొమ్ముల రాజారెడ్డి, అవారి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES