Friday, February 6, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆర్థిక సహాయం చెక్కుల పంపిణీ

ఆర్థిక సహాయం చెక్కుల పంపిణీ

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండల కేంద్రంలో ఇద్దరు లబ్ధిదారులకు ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరు చేసిన ఆర్థిక సహాయం చెక్కులను శుక్రవారం అందజేశారు. బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జి ముత్యాల సునీల్ రెడ్డి సహకారంతో గ్రామానికి చెందిన వంగ నరహరికి రూ.19వేలు, వెల్మల మురళికి రూ.10వేల విలువైన ఆర్థిక సహాయం చెక్కులను ప్రభుత్వ మంజూరు చేసింది.అట్టి చెక్కులను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకేట రవి ఆధ్వర్యంలో నాయకులు లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి ఆర్థిక సహాయం చెక్కులను అందజేశారు.

ఈ సందర్భంగా సుంకేట రవి మాట్లాడుతూ పేద, మధ్యతరగతి ప్రజల వైద్యానికి ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో ఆర్థిక భరోసాను ఇస్తుందన్నారు. లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఆర్థిక సహాయం చెక్కుల మంజూరుకు కృషిచేసిన ముత్యాల సునీల్ రెడ్డికి లబ్ధిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సల్లూరి గణేష్ గౌడ్, నాయకులు నిమ్మ రాజేంద్రప్రసాద్, నూకల బుచ్చి మల్లయ్య, సింగిరెడ్డి శేఖర్, పూజారి శేఖర్, ఉట్నూరి నరేందర్, వేములవాడ జగదీష్, అజారుద్దీన్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -