Friday, September 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్దుర్గాదేవి మండపం వద్ద అన్న వితరణ

దుర్గాదేవి మండపం వద్ద అన్న వితరణ

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండలంలోని కొనసముందర్ గ్రామంలో ముది రాజ్ యూత్ ఆధ్వర్యంలో దుర్గ దేవి మండపం వద్ద శుక్రవారం అన్న వితరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఐదవ రోజు దుర్గాదేవి త్రిపుర సుందరి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా దుర్గాదేవి మండపం వద్ద అర్చకులు అనుదీప్ శర్మ అలంకరణ, అభిషేకం పూజ కార్యక్రమాలను నిర్వహించి దుర్గాదేవికి నైవేద్యాలు సమర్పించారు. అనంతరం మండపం వద్ద నిర్వహించిన అన్న వితరణ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని భోజనాలు చేశారు.కార్యక్రమంలో ముదిరాజు యూత్ అధ్యక్షులు గమ్మత్ రజినీకార్, క్యాషియర్ కల్లా మహేష్, గట్టు హన్మాండ్లు, గడ్డం సుదర్శన్, సబ్బని శ్రీకాంత్, గమ్మత్ ప్రేమ్ కుమార్, యూత్ సభ్యులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -