Monday, September 29, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నవరాత్రి ఉత్సవాల్లో భక్తులకు అన్నదాన వితరణ

నవరాత్రి ఉత్సవాల్లో భక్తులకు అన్నదాన వితరణ

- Advertisement -

నవతెలంగాణ – బిచ్కుంద
నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బిచ్కుంద పట్టణంలోని రంగార్ గల్లీలో ఏర్పాటు చేసిన దుర్గామాత విగ్రహం వద్ద బంగారం, వెండి దుకాణ వర్తక సంఘం సభ్యుడు ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. ఈ నేపథ్యంలో ముఖ్య అతిథులుగా బండాయప్పా సంస్థన్ మఠాధిపతులు శ్రీ సద్గురు సోమలింగ శివాచార్య స్వామిజీ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మల్లికార్జున అప్పా పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా దుర్గామాత విగ్రహానికి పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతపు వారు మాట్లాడుతూ.. అన్నదానం మహా గొప్పదానమని, ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్న ప్రేమ్ కుమార్ ను ఈ సందర్భంగా వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో సంతప్పా, దశరథ్, ఖలీల్, ప్రశాంత్, బాలాజీ, బంగారం వెండి వర్తక సంఘం సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -