నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని పశువైద్యశాలలొ జిల్లా పశు శాఖ ఆదేశాల మేరకు ఉచిత నటల నివారణ మందుల పంపిణీ మండలం పశు వద్య శాఖ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక సర్పంచ్ సావిత్రిబాయి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వెటర్నరీ వైద్యుడు పండరి మాట్లాడుతూ.. జుక్కల్ మండలంలోని గ్రామాలలో 22డిసెంబర్ 2025 నుండి 31 డిసెంబర్ 2025 వరకు నట్టల నివారణ మందులు ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు.
జుక్కల్ మండల కేంద్రంలోని పశువైద్యశాలలొ 528 గొర్రెలకు మరియు ఒక వంద మూడు మేకలకు స్థానిక సర్పంచ్ సవిత్రి బాయి చేతుల మీదుగా నట్టల నివారణ మందులు ఉచితంగా మందు వేసి ప్రారంభించారు. ఈ అవకాశాన్ని మండలంలోని 30 గ్రామపంచాయతీ పరిధిలోని గ్రామాలలో జీవాలు ఉన్నవారు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. నట్టల నివారణ మందులు వేయడం వలన జీవాలు ఆరోగ్యకరంగా ఉంటాయని, లేకుంటే ఆకలి మందగించి మేతమేయకపోవడం వలన జీవాలు బక్క చిక్కి పతాయని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తో పాటు జుక్కల్ వెటర్నరీ వైద్యుడు విఏవో పండరి, జే ఆర్ ఓ మాజీద్ , గోపాల మిత్రులు తదితరులు పాల్గొన్నారు.



