- Advertisement -
నవతెలంగాణ- గోవిందరావుపేట
మండలంలోని పసర గ్రామపంచాయతీ పరిధిలోని 2వ వార్డులో గ్యాస్ కనెక్షన్ లేక ఇబ్బంది పడుతున్న 20 కుటుంబాలకు శ్రీ ముకుంద ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ వారి సహకారంతో శుక్రవారం ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇప్పిచారు. ఉచిత గ్యాస్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రెండవ వార్డు సభ్యురాలు జక్కు సదాలక్ష్మి హాజరై లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ ముకుంద గ్యాస్ ఏజెన్సీ యాజమాన్యం జక్కు రాజు గౌడ్ గీతరాణి , అభినవా వినయ్ కుమార్, జక్కు రణదీప్ గౌడ్, గోనెల రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



