నవతెలంగాణ – కంఠేశ్వర్: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రథసారథి బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ జన్మదినాన్ని పురస్కరించుకొని నిజామాబాద్ నగరంలోని అభయహస్తం కాలనీలో మల్యాల గోవర్ధన్ ఆధ్వర్యంలో కాలనీ ప్రజలకు శనివారం 12 రకాల నిత్యవసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మల్యాల గోవర్ధన్ మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల ప్రతినిధిగా క్రమశిక్షణ కలిగిన కార్యకర్త స్థాయి నుండి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర రథసారధిగా ఎదిగిన బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలకు స్ఫూర్తి దాయకం అన్నారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని అభయ హస్తం కాలనీలో 50 నిరుపేద కుటుంబాలకు సుమారు రూ.1000విలువ గలిగిన 12 రకాల నిత్యవసర వస్తువులు, కూరగాయలు, పంపిణీ చేయడం జరిగింది అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిరుపేద ప్రజలకు సన్నబియ్యం పంపిణీ చేస్తుందని, రాబోయే కాలంలో రేషన్ షాపు ద్వారా నిత్యవసర వస్తువులను పంపిణీ చేయాలని కోరుతూ ఈ విధమైన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో అభయహస్తం కాలనీ ప్రజలు నర్సింగ్, నాగిరెడ్డి, జమీర్, స్వరూప, రాధిక, సంతోష్, రమాదేవి, స్వర్ణ, నసీమ, అంజు తదితరులు పాల్గొన్నారు.
టీపీసీసీ చీఫ్ బర్త్ డే.. పేదలకు సరుకుల పంపిణీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES