రూ. 9 కోట్ల 77 లక్షలకుపైగా విలువైనవి ఐకేపీ, మెప్మా, పీఏసీఎస్, డీసీఎంఎస్ బాధ్యులకు పంపిణీ
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
జిల్లాలో ధాన్యం కొనుగోలు చేసిన ఐకేపీ, మెప్మా, పీఏసీఎస్, డీసీఎంఎస్ బాధ్యులకు కమీషన్ చెక్కులను ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో పంపిణీ చేశారు. జిల్లాలో ఐకేపీ, మెప్మా, పీఏసీఎస్, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఖరీఫ్ 2023-24 సీజన్ లో ధాన్యం కొనుగోలు చేయగా, ఇంకా 30 శాతం కమీషన్ రూ. 1,90,73,487, అలాగే రబీ సీజన్లో 2023- 24 లో 2,62,446 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. 100 శాతం కమిషన్ రూ. 7,86,91,920 విలువైన చెక్కులను ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ పంపిణీ చేశారు. మొత్తం రూ. 9 కోట్ల 77 లక్షలకుపైగా విలువైనవి అందజేశారు. కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి చంద్ర ప్రకాశ్, డీఎం రజిత, డీసీఓ రామకృష్ణ, మెప్మా ఏవో మీర్జా ఫసహత్ అలీ బేగ్, అడిషనల్ డీఆర్డీఓ శ్రీనివాస్, డీసీఎంఎస్ ఇంచార్జి శ్రీనివాస్, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు భాగ్య తదితరులు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోలు కమీషన్ చెక్కులు పంపిణీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



