నవతెలంగాణ-కమ్మర్ పల్లి
బాల్కొండ నియోజకవర్గంలోని పలు పాఠశాలలకు కూచుకుళ్ల ఫౌండేషన్ భీంగల్ తాలూకా వ్యవసాయ దారుల సంఘం ఆధ్వర్యంలో పాఠశాలలకు గ్రీన్ బోర్డ్స్ వితరణ చేసినట్లు చైర్మన్ కూచుకుళ్ల సరిత రాజేష్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు మంగళవారం బాల్కొండ నియోజకవర్గంలోని 22 పాఠశాలలకు 30 గ్రీన్ బోర్డ్స్ ను అందజేసినట్లు ఆమె తెలిపారు. కూచుకుళ్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాల్కొండ నియోజకవర్గం లోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం మరిన్ని గ్రీన్ బోర్డ్స్ అందించాలని నిర్ణయించినట్లు తెలిపారు.
అంతకు ముందు మోర్తాడ్ మండల కేంద్రంలోని భీంగల్ తాలూకా వ్యవసాయదారుల సంఘం కార్యాలయం వద్ద వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ బద్దం నర్సారెడ్డి విగ్రహానికి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో బద్దం సునీత నర్సారెడ్డి, భీంగల్ తాలూకా వ్యవసాయ దారుల సంఘం రేంజర్ల గంగారాం, సభ్యులు సుంకేట రవి, ఏనుగు కిషన్, బీజీ గంగారాం, కుంట గంగారాం, వేముల భూమేశ్వర్, ఉట్నూర్ ప్రదీప్, అల్గొట్ రంజిత్, శైలేందర్, తదితరులు పాల్గొన్నారు.
పాఠశాలలకు గ్రీన్ బోర్డ్స్ వితరణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES