నవతెలంగాణ – ఆర్మూర్
బార్ అసోసియేషన్ అధ్యక్షులు జక్కుల శ్రీధర్, ప్రధాన కార్యదర్శి జెస్సు అనిల్ కుమార్ ఆధ్వర్యంలో న్యాయవాదులకు హెల్త్ కార్డులను బార్ అసోసియేషన్ హాలునందు సోమవారం విడుదల చేసినారు. ఈ కార్డులను సీనియర్ న్యాయవాదులైన లోక భూపతిరెడ్డి, కే గంగారెడ్డి, వి జగదీశ్వర్ రెడ్డి, ఎస్ శ్రీధర్ గార్లకు ముందుగా అందించడమైనది.
న్యాయవాదుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం న్యాయవాదులకు హెల్త్ కార్డులను ఇవ్వడాన్ని బార్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం న్యాయవాదులకు మరెన్నో అమలు చేసి ఆదుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఆర్మూర్ కోశాధికారి గజ్జల చైతన్య, కృష్ణ పండిత్, చిలుక కిష్టయ్య, బేతు జగదీష్, ఎండి తాజుద్దీన్, జగన్, బొట్ల జీవన్, ఐనారి అశోక్, దాస్, మోహన్ నాయక్ తదితర న్యాయవాదులు పాల్గొన్నారు.