- Advertisement -
నవతెలంగాణ – రాయికల్
మండలంలోని అన్ని గ్రామాలలో స్వయం సహాయక సంఘాల సభ్యులకు, 18 సంవత్సరాల పైబడిన మహిళా సంఘాలలో లేని మహిళలకు కూడా చీరలు పంపిణి చేస్తున్నట్లు సెర్ప్ ఏపీఎం పి.నరహరి తెలిపారు. సోమవారం అల్లీపూర్,ఆలూర్, వీరాపూర్,ధర్మాజీపేట్ గ్రామాలలో ఎంపీడీవో బింగి చిరంజీవి ఆధ్వర్యంలో చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో సుష్మ,ఆర్.ఐ పద్మయ్య, దేవదాస్, సీసిలు గంగారాం, సుజాత, లావణ్య, పంచాయితి కార్యదర్శులు, జీపివోలు, మండల సమాఖ్య సభ్యులు పాల్గొన్నారు.
- Advertisement -



