Monday, January 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మైబాపూర్  సర్పంచ్ చేతుల మీదుగా ఇందిరమ్మ చీరల పంపిణీ

మైబాపూర్  సర్పంచ్ చేతుల మీదుగా ఇందిరమ్మ చీరల పంపిణీ

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని మైబాపూర్ గ్రామంలో ఇందిరమ్మ చీరలు మహిళలకు పంచిన గ్రామ సర్పంచ్ బశవ్వ అశోక్ రెడ్డి, ఉపసర్పంచ్ ఇర్ఫాన  ఆరిఫ్ వార్డ్ మెంబర్ ఎ. పూజ జ్ఞానేశ్వర్  మహిళా సంఘం అధ్యక్షురాలు నాగమణి శంకర్ ఉలన్న, గ్రామ వివోఏ రాజు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ బశవ్వ అశోక్ రెడ్డి మాట్లాడుతూ… గ్రామ అభివృద్ధికి అన్ని విధాల తోడ్పాటున అందిస్తానని అన్నారు. గ్రామంలో ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు సలహాలు ఇవ్వాలని సూచించారు. ఐకేపీ ఆధ్వర్యంలో మహిళా సంఘాల పంపిణీ చేస్తున్న చీరలు సంఘంలో ఉన్న సభ్యులకు ప్రతి ఒక్కరికి చీరలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ మహిళ సంఘాలతో పాటు సర్పంచ్ , ఉప సర్పంచ్ , గ్రామ పెద్దలు,  మహిళా సంఘాలు , తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -