- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
మండలంలోని సిద్ధ రామేశ్వర నగర్ గ్రామంలో ఇందిరమ్మ చీరలను డ్వాక్రా గ్రూప్ మహిళలకు పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భీమ్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుదర్శన్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శ్రీరామ్ వెంకటేష్, నాయకులు దుర్గ బాబు, లింగారెడ్డి, డ్వాక్రా గ్రూప్ మహిళలు, తదితరులు, పాల్గొన్నారు.
- Advertisement -



