- Advertisement -
నవతెలంగాణ – మునుగోడు: మండలంలోని కల్వకుంట్ల గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘంలోని మహిళలకు అందించే చీరలను గ్రామ సర్పంచ్ సింగపంగ లక్ష్మమ్మ ఆదివారం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి ప్రభుత్వ పథకాన్ని అర్హులైన లబ్ధిదారులకు అందించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ బొందు రవీందర్ తదితరులు ఉన్నారు.
- Advertisement -



