- Advertisement -
నవతెలంగాణ – గోవిందరావుపేట
మండల కేంద్రంలో జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పెండెం శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ.. నాణ్యతతో కూడిన ఈ చీరలను క్రమశిక్షణకు మారుపేరుగా యూనిఫామ్ గా అందిస్తున్నామని అన్నారు. ప్రతి మహిళకు చీర అందే విధంగా మహిళా సంఘాల సమాఖ్య ద్వారా పంపిణీ కార్యక్రమం ఉంటుందని అన్నారు. ఇందిరా గాంధీ భారత ప్రధానిగా మహిళలోకానికి చేసిన సేవలకు గుర్తింపుగా ఇందిరమ్మ చీరలను అందిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని పంపిణీ సక్రమంగా జరగాలని సూచించారు.
- Advertisement -



