నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : మహిళా స్వయం సహాయక సంఘాలకు గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో వడ్డీ లేని రుణాలు, ప్రమాద బీమా బాధిత కుటుంబాలకు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి చెక్కులు పంపిణీ చేయనున్నట్లు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ .. మహిళా సాధికారత సాధనే ప్రభుత్వ లక్ష్యంమని అన్నారు.
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో ముందుకు వెళ్తుందని తెలిపారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో వడ్డీ లేని రుణాలు, లోన్ బీమా, బాధిత కుటుంబాలకు ప్రమాద బీమా పరిహారం చెక్కులను పంపిణీ బుధవారం భువనగిరి పట్టణంలో గల ఏ. ఆర్ ఫంక్షన్ హాల్ లో ఘనంగా ఇందిరా మహిళా శక్తి సంబురాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమానికి ప్రజా ప్రతినిధులు, చైర్మన్లు, జిల్లా, మండల మహిళా సమాఖ్యల ప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొంటారు.