- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి గురువారం నందిపేట్ మండల కేంద్రంలో కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వాలతో సంబంధం లేకుండా ప్రజలకు పథకాలు చేరడమే ముఖ్య ఉద్దేశం కళ్యాణ లక్మి, షాది ముబారక్ చెక్కులు ఇవ్వడం వెనుక పేద మధ్యతరగతి కుటుంబాలకు కొంత చేయూత ఇవ్వాలని ఉద్దేశ్యంతో ఈ పథకం ఉంది అని అన్నారు. అధికారులు ప్రజలతో మంచి సంబంధాలు కొనసాగించాలని, సమస్యలు వస్తాయి వాటిని ప్రభుత్వమే పరిష్కారం చేయాలని కాకుండా కొంత మేర ప్రజలు కూడా స్పందించాలని అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలూరు మండల అధ్యక్షుడు శ్రీకాంత్,నందిపేట్ మండల అధ్యక్షుడు పటేల్ రాజు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -


