Saturday, February 28, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ 

కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ 

- Advertisement -

నవతెలంగాణ – రామారెడ్డి 
మండల కేంద్రంలోని రైతు వేదికలో శనివారం మండలంలోని ఎల్లారెడ్డి నియోజకవర్గ గ్రామాలకు చెందిన కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను ఆయా గ్రామాల సర్పంచులు, అధికారులు లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ గౌడ్ మాట్లాడుతూ.. ఎల్లారెడ్డి నియోజకవర్గ శాసనసభ్యులు మదన్మోహన్రావు ఆదేశాల మేరకు లబ్ధిదారులకు 21 చెక్కులు అందజేశామని తెలిపారు. కార్యక్రమంలో తహసిల్దార్ ఉమా లత,స్థానిక సర్పంచ్ బండి ప్రవీణ్, ఆయా గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచ్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -