Friday, July 11, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్ : ఆలూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రమేష్ ఆధ్వర్యంలో శుక్రవారం కళ్యాణ లక్ష్మి చెక్కులు 20 మంది  లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆలూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముక్కెర విజయ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో దళిత, గిరిజన, బీసీ, ఓబీసీ వర్గాలకు చెందిన నిరుపేద కుటుంబాల యువతుల వివాహాల కోసం ఒక్కో లబ్ధిదారునికి రూ.1,00,116 ఆర్థిక సహాయం అందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తోందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో రెవిన్యూ ఇన్స్పెక్టర్ రేణుబాయి, కాంగ్రెస్ నాయకులు నిలగిరి శ్రీను, మహేష్, అలాగే బీజేపీ నాయకులు మల్లయ్య, ప్రణయ్ తేజ్, హరీష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -