నవతెలంగాణ – డిచ్ పల్లి
నిజామాబాద్ రూరల్ పరిధిలోని గూపన్పల్లి బైపాస్ రోడ్డు వద్ద రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిజామాబాద్ రూరల్ మండలాల కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్ చెక్కు లను పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. రూరల్ నియోజకవర్గంలో సుమారు 200 మంది లాబ్దిదారులకు కాళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇందల్ వాయి మండల కాంగ్రెస్ అధ్యక్షులు మోత్కూరి నవీన్ గౌడ్, డిసిసి డెలిగేట్ తలారి సుధాకర్, నల్లవెల్లి సహకార సొసైటీ చైర్మన్ నోముల శ్రీనివాస్ రెడ్డి,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చిన్ రెడ్డి సంతోష్ రెడ్డి, మార్కేట్ కమిటీ డైరెక్టర్ రాజు, మండల ముఖ్య నాయకులు మండలంలోని అన్ని గ్రామాల నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు నియోజకవర్గ లబ్దిదారులు పాల్గొన్నారు.
కళ్యాణలక్ష్మీ చెక్కుల పంపిణీ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES