- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన కళ్యాణ లక్ష్మి చెక్కులను మద్నూర్ మండలంలోని పెద్ద షక్కర్గ గ్రామ లబ్ధిదారులకు ఆ గ్రామ సర్పంచ్ విశాలాక్షి కుటుంబ సభ్యులు సలాబత్పూర్ ఆంజనేయస్వామి దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆలయ కమిటీ చైర్మన్ రామ్ పటేల్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం మద్నూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మద్నూర్ గ్రామ సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ధరాస్ సాయిలు, మండల తహసిల్దార్ ఎండి ముజీబ్, ఆర్ఐ శంకర్ కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులు పాల్గొన్నారు.
- Advertisement -



