Monday, August 11, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్కళ్యాణ లక్ష్మి పథకం చెక్కుల పంపిణీ

కళ్యాణ లక్ష్మి పథకం చెక్కుల పంపిణీ

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
కళ్యాణ లక్ష్మి పథకం పేదింటి ఆడబిడ్డ పెళ్లికి ఒక వరం లాంటిదని మద్నూరు మండలంలోని కొడిచరా గ్రామ తాజా మాజీ సర్పంచ్ సంతోష్ పటేల్ అన్నారు. ఆ గ్రామానికి చెందిన లబ్ధిదారు రాలుకి మంజూరైన కళ్యాణ లక్ష్మి పథకం చెక్కును మండల తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ ఎండి ముజీబ్ తాజా మాజీ సర్పంచ్ సంతోష్ పటేల్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా తాజా మాజీ సర్పంచ్ మాట్లాడుతూ.. పేదింటి ఆడబిడ్డల పెళ్లిలకు రాష్ట్ర ప్రభుత్వం అందించే కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా రూ.1 లక్షా 116 ఆ కుటుంబానికి ఎంతో మేలు చేస్తుందని తెలిపారు. కల్యాణ లక్ష్మి పథకం చెక్కు అందుకున్న కుటుంబం ప్రభుత్వానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ చెక్కు పంపిణీ కార్యక్రమంలో తాసిల్దార్ తాజా మాజీ సర్పంచ్ మద్నూర్ సింగిల్ విండో కార్యదర్శి జే బాబు పటేల్ లబ్ధిదారులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img