Monday, July 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వ జూ. కళాశాలకు మైక్ సెట్ వితరణ

ప్రభుత్వ జూ. కళాశాలకు మైక్ సెట్ వితరణ

- Advertisement -

నవతెలంగాణ- ఆర్మూర్ : ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్, చార్టెడ్ అకౌంటెంట్ ఈరవత్రి రాజశేఖర్ రూ.16 వేలు విలువైన మైక్ సెట్, స్పీకర్ సౌండ్ సిస్టమ్ ను సోమవారం వితరణ చేశారు. గత వారం జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ విజయానంద్ రెడ్డి లెక్చరర్ లు, విద్యార్థులు, ఈ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఫౌండేషన్ కార్యాలయంలో కలిసి, తమ కాలేజీకి మైక్ సెట్ లేదని, అందువల్ల ఏ ప్రోగ్రామ్ చేయలేక పోతున్నామని తెలిపారు. దీంతో స్పందించిన ఫౌండేషన్ మైక్ సెట్ కొని కాలేజీ యాజమాన్యానికి అందించారు. ఈ ,కార్యక్రమంలో లెక్చరర్ లు బట్టు నరేందర్, జి. శ్రీనివాస్, ఏ.చంద్రమోహన్, యం.లక్మన్, పి. నరేశ్, జె.గంగాధర్, అర్గుల్ సురేష్, ప్రముఖ రియల్టర్ అంకాపూర్ రాజేష్, వ్యాపారవేత్త జక్కుల చంద్రశేఖర్ రాంప్రసాద్  తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -