Tuesday, March 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నాచురల్ ఫార్మింగ్ ఓరియంటేషన్ కిట్ల పంపిణీ

నాచురల్ ఫార్మింగ్ ఓరియంటేషన్ కిట్ల పంపిణీ

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండలంలోని ఖండేబెల్లుర్  గ్రామపంచాయతీ పరిధిలోని కౌలాస్ గ్రామం రైతులకు నాచురల్ ఫార్మింగ్ ఓరియంటేషన్ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించామని మండల వ్యవసాయ అధికారిని మహేశ్వరి తెలిపారు. ఈ క్రమంలో మహేశ్వరి ఫార్మర్ కిట్లను రైతులకు అందజేశారు. అదేవిధంగా ఖండేబల్లూర్ రైతు వేదికలో కౌలాస్ విలేజ్ నేచురల్ ఫార్మింగ్ చేసే రైతులకు కూడా ఈ కిట్లను పంపిణీ చేశారు. ఈ కిట్ తో పాటు హెడ్ క్యాప్, ఫార్మర్ ఐడి కార్డు,  రెండు పుస్తకాలు, ఒక పెన్ను వారికి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో  జుక్కల్ మండల ఏవో, కౌలాస్ గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -