నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని పలు గ్రామాలలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కాంగ్రెస్ నాయకుల చేతుల మీదుగా జోరుగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా పడంపల్లి గ్రామంలో యువ నాయకుడు హనుమాజీ వారి మహేష్ , బంగారు పల్లి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సతీష్ పటేల్ , కేమ్రాజ్ కల్లాలి మాజీ సర్పంచ్ రమేష్ దేశాయ్ , వజ్రఖండి గ్రామ పార్టీ అధ్యక్షుడు ప్రకాష్ పటేల్, యువజన అధ్యక్షుడు జైపాల్ రెడ్డి, మైలార్ లో అంకుష్ , సాయి , విద్యలవాడిలో మాజీ సర్పంచ్ మాధవరావు పటేల్ చేతుల మీదుగా పంపిణీ చేసేందుకు ఆయా గ్రామాలలో కార్యక్రమాలు కాంగ్రెస్ శ్రేణులు నిర్వహించారు. దశాబ్ద కాలంగా పెండింగ్ ల ఉన్న ఎదురుచూస్తున్న కొత్త రేషన్ కార్డుల పంపిణి లబ్ధిదారులకు కుటుంబాలలో సంతోషంతో వెలుగు నింపుతోందని కాంగ్రెస్ మండల పార్టీ యూత్ అధ్యక్షుడు సతీష్ పటేల్ అన్నారు.
రేషన్ కార్డుల పంపిణీ జరుగుతుంటే మహిళలు సంతోషంగా కొత్త రేషన్ కార్డులు తీసుకొని ఆనందంలో ఉన్నారని పడంపల్లి గ్రామ కాంగ్రెస్ యూత్ నాయకుడు హనుమజీవార్ మహేష్ అన్నారు. రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం గ్రామాలలో పండుగ వాతావరణంలో నిర్వహిస్తున్నామని వజ్రకండి గ్రామ పార్టీ అధ్యక్షుడు ప్రకాష్ పటేల్, యువజన కాంగ్రెస్ నాయకుడు జైపాల్ రెడ్డి పేర్కోన్నారు. ప్రజల సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాలంటే అది కాంగ్రెస్కి సాధ్యమని పలువురు కాంగ్రెస్ పడంపల్లి యూత్ నాయకుడు పౌడే సురేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల గ్రామపంచాయతీ కార్యదర్శులు కాంగ్రెస్ నాయకులు, యువజన నాయకులు శివరాజ్ , బసవరాజ్, వినాయక్, ఈశ్వర్ గొండ , శివాజీ పటేల్, సీనియర్ నాయకులు , తదితరులు పాల్గొన్నారు .