నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని బంగారు పల్లి గ్రామంలో కొత్త రేషన్ కార్డులు ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఆదేశాల మేరకు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల పార్టీ యువజన అధ్యక్షుడు సతీష్ పటేల్ చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. ఎన్నో ఏండ్లుగా దశాబ్ద కాలంగా ఎదురుచూస్తున్న కొత్త రేషన్ కార్డులు లబ్ధిదారులకు చేరగానే సంతోషంగా ఉన్నారని తెలిపారు. ఈ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో జిపి కార్యదర్శి, జుక్కల్ మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు , మండల యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సతీష్ పటేల్ , సిద్దాపూర్ మనోహర్ పాటీల్ , బంగారు పల్లి గ్రామ లబ్ధిదారులు , గ్రామ పెద్దలు, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
బంగారుపల్లిలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES