- Advertisement -
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ మండలంలోని మడద గ్రామంలో బుధవారం నూతన రేషన్ కార్డులను గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద పంపిణీ చేశారు. గ్రామంలో నూతన రేషన్ కార్డులు 59 మంజూరు కాగా 27 కొత్తవి, 32 మంది లబ్ధిదారులకు అడిషనల్ గా పేరు నమోదు అయినట్లు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వనిత, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు తాళ్లపల్లి రణధీర్ , బలగొని శ్రీనివాస్ , బంటు ప్రతాప్ , కాంగ్రెస్ నాయకులు, ఫీల్డ్ అసిస్టెంట్ సదానందం తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -