-మునగల వీడు గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో పేదల రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో 110 మంది విద్యార్థులకు అందజేత
-పేదల రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిరగాని బిక్షపతి గౌడ్
నవతెలంగాణ నెల్లికుదురు
మండలంలోని మునిగిలవీడు గ్రామంలోని ప్రాథమిక పాఠశాల లో చదువుతున్న పేద విద్యార్థులకు నోటుబుక్కులు పెన్సిల్ పెన్నులు బిస్కెట్స్ వంటివి వాటిని అందించినట్లు పేదల రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిరగాని బిక్షపతి గౌడ్ తెలిపారు. మహాత్మ జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకను పురస్కరించుకొని 110 మంది విద్యార్థులకు పంపిణీ చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో పాఠశాలలోని 110 మంది విద్యార్థిని విద్యార్థులకు నోటు బుక్స్, పెన్నులు, పెన్సిల్స్ ,బిస్కెట్స్ అందించామని తెలిపారు.
మహాత్మా జ్యోతిరావు పూలే గారి సేవలు ఎనలేనివి అని ,వారి ఆశయ సాధన కోసం పని చేయాలని,దేశంలో పేద బిడ్డలకు విద్య అందాలనే తన ఆశయ సాధనాన్ని ముందుకు తీసుకెళ్లాలని,నేడు దేశంలో కార్పొరేట్ సంస్థల విద్యదోపిడిని అరికట్టాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను వారు డిమాండ్ చేశారు, అలాగే 2009 విద్యా హక్కు చట్టాన్ని వెంటనే అమలు చేసి పేద బిడ్డలకు ఉన్నత విద్య అందించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామ సర్పంచ్ బొల్లికొండ చైతన్య నాగరాజు ,పాఠశాల హెడ్ మాస్టర్ రవీందర్ , ఉపాద్యాల బృందం,, గ్రామ వార్డు మెంబర్లు, ఐత వెంకటలక్ష్మి , తుప్పతూరీ నర్మద ,నల్లాని పాపారావు ,గిరగాని ప్రవీణ్, కాంగ్రెస్ నాయకులు గ్రామ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు కొలిపాక వెంకన్న, శ్రీరంగం శ్రీను తుప్పతూరీ రాజు, ఇస్సంపల్లి రాములు , యాకయ్య , ఈసంపల్లి సైదులు ఉపేందర్ తో పాటు కొంతమంది పాల్గొన్నారు.



