Saturday, July 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్క్షయ వ్యాధి గ్రస్తులకు న్యూట్రిషన్ కిట్ల పంపిణీ

క్షయ వ్యాధి గ్రస్తులకు న్యూట్రిషన్ కిట్ల పంపిణీ

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ : క్షయ వ్యాధిగ్రస్తులకు న్యూట్రిషన్ కీట్ల పంపిణీ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ బి రాజశ్రీ చేతుల మీదుగా ఐడిఓసి వద్ద పంపిణీ చేశామని రెడ్ క్రాస్ చైర్మన్ బుస ఆంజనేయులు తెలిపారు. ఈ సందర్భంగా డి ఎం హెచ్ ఓ డాక్టర్ బి రాజశ్రీ మాట్లాడుతూ.. క్షయ వ్యాధిగ్రస్తులకు పోషకాహారం నిమిత్తం న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేయడం చాలా హర్షించదగ్గ విషయమని, రెడ్ క్రాస్ సభ్యులను అభినందించారు. అదేవిధంగా జిల్లా రెడ్క్రాస్ ఆధ్వర్యంలో సుమారు 30 మంది క్షయ వ్యాధిగ్రస్తులకు పోషకాహార కిట్లను పంపిణీ చేయడానికి ముందుకు వచ్చినందుకు అభినందించారు. ఇంకా ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ తోట రాజశేఖర్,రెడ్ క్రాస్ జిల్లా కోశాధికారి కరిపే రవీందర్ , పి ఓ ఎం సి హెచ్ డాక్టర్ సుప్రియ, రెడ్ క్రాస్ మోపాల్ మండల చైర్మన్ శ్రీ ఘన్పూర్ వెంకటేశ్వర్లు,శ్యామల, నాగరాజు,లబ్ధిదారులైన క్షయ వ్యాధిగ్రస్తులు వారి సహాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -