- Advertisement -
నవతెలంగాణ – భీంగల్ : ఈ ఎండాకాలంలో జాగ్రత్తలు పాటించాలని భీంగల్ మెడికల్ ఆఫీసర్ అజయ్ పవర్ సూచించారు. ఈరోజు భీంగల్ పట్టణంలో మార్కెట్లో కూర్చొని కూరగాయ కొట్టు వ్యాపారులకు, పండ్ల వ్యాపారులకు ఓఆర్ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. తీవ్ర ఎండలు ఉన్నందున ఎండలో తిరగడం వల్ల బాడీ సహకరించకపోవడం అట్లాంటి ఇబ్బందులు ఉంటాయని, ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లను ఒక లీటర్ నీటిలో కలిపి త్రాగాలని వ్యాపారులకు వివరించారు. ఎండాకాలంలో వడదెబ్బ సోకే అవకాశం ఉందని, వడదెబ్బకు గురి కాకుండా ముందు జాగ్రత్త చర్యలు పాటించాలన్నారు. అత్యవసర పని ఉంటే తప్న ఎండలో ఎక్కువగా తిరగవద్దని ప్రజలకు సూచించారు.
- Advertisement -