- Advertisement -
నవతెలంగాణ – సదాశివ నగర్
మండలంలోని పద్మాజివాడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు మోడే గాం సర్పంచ్ గౌడేల్లి గంగాధర్ అట్టలు పెన్నులు విద్యార్థులకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు పరీక్షలలో మంచి మార్కులు సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పద్మాజివాడి సర్పంచ్ లోకోటి సుబ్బారావు, ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయ బృందం, వార్డ్ మెంబర్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
- Advertisement -



