మండల వ్యవసాయ అధికారి సిద్ది రామేశ్వర్
నవతెలంగాణ – రెంజల్
రెంజల్ మండలానికి 40 శాతం సబ్సిడీపై 644 శనగ బస్తాలు వచ్చాయని, కందకుర్తి, నీలా, తాడు బిలోలి, బోర్గం, గ్రామ రైతులు సద్వినియోగం చేసుకోవాలని రెంజల్ మండల వ్యవసాయ అధికారి సిద్ధిరామేశ్వర్ తెలిపారు. క్లస్టర్ డెమోస్ట్రేషన్ లో భాగంగా 25 కిలోల శనగ బస్తాలు వచ్చాయని, ఆయా గ్రామాల రైతులు మండల వ్యవసాయ విస్తీర్ణ అధికారులకు తమ పట్టా పాస్ పుస్తకాలతో పాటు ఆధార్ కార్డు జిరాక్స్ లను అందజేయాలన్నారు. 40 శాతం సబ్సిడీపైబస్తా కు800 రూపాయలు చెల్లించి తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ విస్తీర్ణ అధికారులు గోపికృష్ణ, ప్రసాద్ సాయిలు, కవిత, నీలా సింగిల్ విండో సీఈఓ రాందాస్, రైతులు పాల్గొన్నారు.
సబ్సిడీపై శనగ విత్తనాల పంపిణీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES