నవతెలంగాణ – ఆర్మూర్
వనమహోస్సవం కార్యక్రమంలో ఇంటింటికి మొక్కల పంపిణీ లో భాగంగా 3 , 4 వార్డులలో శుక్రవారం మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించినారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ రాజు మాట్లాడుతూ.. 100 రోజుల కార్యాచరణలో భాగంగా వార్డు నంబర్ 12 , 29 లో డిసిల్టింగ్ పనులను పరిశీలించడం జరిగిందని అన్నారు. 12 వ వార్డులో డ్రై డే కార్యకలాపాలలో పాల్గొని, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కాలనీ వాసులకి చెప్పడం జరిగింది. మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన బస్తీ ధవాఖానను సందర్శించి రోగుల వివరాలు, మందుల లభ్యత గురించి మెడికల్ ఆఫీసర్ ను అడిగి తెలుసుకున్నట్టు చెప్పారు .ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మున్సిపల్ ఆధ్వర్యంలో మొక్కల పంపిణీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES