- Advertisement -
నవతెలంగాణ మద్నూర్
మద్నూర్ మండలంలోని కోడ్చిర గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం అందచేస్తున్న రంజాన్ తోఫా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు ఆదేశాల మేరకు బుధవారం గ్రామంలో ముస్లింలకు అందజేసినట్టు మండల యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హన్మంత్ యాదవ్ తెలిపారు. ఈ రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సంతోష్ పటేల్, ఉప సర్పంచ్ కృష్ణ గౌడ్, బోలెవర్ నాగ్నాథ్, దాసరి నాగ్నాథ్, వీరేశం గౌడ్, గ్రామ యువకులు, పెద్దలు, ముస్లిం నిరుపేదలు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



