Sunday, March 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా కిట్‌ల పంపిణీ

ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా కిట్‌ల పంపిణీ

- Advertisement -

నవతెలంగాణ – ఆలేరు రూరల్
ఆలేరు మండలంలోని గొలనుకొండ గ్రామంలో రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఆదివారం  బీర్ల ఫౌండేషన్ మరియు బీర్ల ఐలన్న ఎమ్మెల్యే సహకారంతో గ్రామంలోని పలు ముస్లిం మైనార్టీ కుటుంబాలకు నిత్యవసర  సరుకులతో రంజాన్ తోఫా కిట్‌లను అందజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఇందూరి యాదిరెడ్డి, ఉప సర్పంచ్ బాకీ యాదగిరి, గ్రామ కాంగ్రెస్ శాఖ అధ్యక్షులు భీమగాని శ్రీనివాస్, గ్రామ వార్డు సభ్యులు కొలిపాక సత్యనారాయణ, ఇందూరి అంజిరెడ్డి, పాల సెంటర్ చైర్మన్ రాములు, మాజీ ఎంపీటీసీ రాంమల్లయ్య, లక్ష్మి,ఆలేరు మండల ఓబీసీ అధ్యక్షులు బందారాపు మధు గౌడ్,కాంగ్రెస్ సీనియర్ నాయకులు తండ యాదగిరి, పర్నే వేణు, బాకీ అశోక్, ఇందూరి రాజశేఖర్, ఎగమామిడి కృష్ణారెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.రంజాన్ మాసంలో ముస్లిం సోదరులకు సహాయం చేయడం ఆనందంగా ఉందని నాయకులు తెలిపారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను పెంపొందిస్తాయని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -