- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని సోపూర్ గ్రామంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యదర్శి అశోక్ రాథోడ్ ఆధ్వర్యంలో గురువారం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో నూతనంగా వివాహాలు చేసుకున్న కొత్త జంటల వారికి, కొత్తగా జన్మించిన పిల్లల పేర్లను కొత్తగా మీ సేవలో పేర్లు నమోదు చేసుకున్న వారికి రేషన్ కార్డులలో నమోదు చేసుకోవడంతో కొత్తగా మంజూరై కార్డులు వచ్చాయని అన్నారు. వాటిని గ్రామానికి సంబంధిత లబ్ధిదారులకు గ్రామ పెద్దలు శివాజీ పటేల్ చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగిందని జిపి కార్యదర్శి తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి మరియు గ్రామ పెద్దలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -