ఎఎంసి వైస్ చైర్మన్ నేరెళ్ల నరసింగం గౌడ్
నవతెలంగాణ – తంగళ్లపల్లి
నిరుపేదలకు రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ అని ఎఎంసి వైస్ చైర్మన్ నేరెళ్ల నరసింగం గౌడ్ అన్నారు. గురువారం మండలంలోని అంకుషాపూర్ గ్రామంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ప్రవీణ్ జే టోనీతో కలిసి లబ్ధిదారులకు రేషన్ కార్డు మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వంలో అర్హులందరికీ రేషన్ కార్డులు మంజూరు చేయడం జరిగిందని.. రేషన్ కార్డుల ద్వారా అందరికీ నాణ్యమైన సన్నబియ్యం కూడా అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు అంజయ్య, ప్రధాన కార్యదర్శి కంకణాల లక్ష్మణ్, రాజేశం, భైరి శ్రీనివాస్ రెడ్డి, బాలసాని రాజ, భానుచందర్, సాయి రెడ్డి, బాల్రెడ్డి, ఎల్లారెడ్డి, రాంప్రసాద్, సంజీవ్ రెడ్డి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES