నవతెలంగాణ – డిచ్ పల్లి
అమెరికాకు చెందిన హెల్ప్ టు అదర్స్ స్వచ్చంద సంస్థ ఆద్వర్యంలో డిచ్‌పల్లి గ్రామంలోని ప్రభుత్వ బీసీ సంక్షేమ వసతి గృహంలో విద్యార్థినిలకు రగ్గులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా బీసీ సంక్షేమ అభివృద్ధి అధికారి నర్సయ్య ముఖ్యాతిథిగా హాజరై మాట్లాడుతూ.. విద్యార్థినిలను చలి నుండి కాపాడేందుకు హెల్ప్ టు అదర్స్ సంస్థ రగ్గులు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. విద్యార్థినిలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని చిన్నప్పటినుంచి సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలని సూచించారు.హెల్ఫ్ టు అదర్స్ తెలంగాణ కో ఆర్డినేటర్ జిల్కర్ విజయానంద్ మాట్లాడుతూ చలి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని అమెరికాలో నివాసముంటున్న హెల్ఫ్ టు అదర్స్ సంస్థ వ్యవస్థాపకురాలు శ్రీలత కొరడా రగ్గులు సమకూర్చారని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిచ్‌పల్లి ప్రభుత్వ బీసీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ దివ్య, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మెన్ బుస్స ఆంజనేయులు,జిల్లా కో- ఆర్డినేటర్ చింతల గంగాదాస్,రెడ్ క్రాస్ పీఆర్వో రామకృష్ణ పాల్గొన్నారు.
వసతి గృహ విద్యార్థినిలకు రగ్గులు పంపిణీ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


