- Advertisement -
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
స్వచ్ఛత కార్మికులకు చీరలు, ధోతిలను రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పంపిణీ చేశారు. సోమవారం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో భారత్ సేవాశ్రమ సంఘ నిర్వహించిన కార్యక్రమంలో పొరుగు సేవల సిబ్బంది, తోటమాలీలు, పారిశుధ్య సిబ్బందికి వాటిని అందజేసారు. అందరికి ఆరోగ్యం, సంతోషంగా ఉండేందుకు నిరంతరం శ్రమిస్తున్న స్వచ్ఛత కార్మికులకు ప్రతి ఏటా గౌరవించుకుంటున్న సేవాశ్రమ సంఘ బాధ్యుతులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ ముఖ్య కార్యదర్శి ఎం.దాన శిశోర్, భారత సేవాశ్రమ్ సంఫ్‌ు బాధ్యలు స్వామి వివేకానంద మహారాజ్, రాజ్‌భవన్ అధికారులు పాల్గొన్నారు.
- Advertisement -