Sunday, July 6, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్విజయదశమికి చీరల పంపిణీ..!

విజయదశమికి చీరల పంపిణీ..!

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : రాష్ట్రంలోని 65 లక్షల మంది మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఒక్కొక్కరికి రెండు చొప్పున చీరలు పంపిణీ చేయాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికే సిరిసిల్లలో పవర్‌ లూం మీద చీరలు తయారు చేయిస్తున్నట్లు తెలిసింది. 65 లక్షల మందికి రెండు చొప్పున 1.30 కోట్ల చీరలు అవసరం అవుతాయి. ఈ మేరకు 4 కోట్ల మీటర్ల చీరలు అవసరం పడతాయని ఆఫీసర్లు అంచనా వేశారు. ఇందులో కోటి మీటర్ల చీరలు తయారై ప్రాసెసింగ్‌కు సిద్ధంగా ఉన్నాయి. మిగిలిన వాటి తయారీ కొనసాగుతున్నది. సిరిసిల్లలో రోజుకు సుమారు 5 వేల మంది పవర్​లూం కార్మికులు దీనికి సంబంధించిన వర్క్ చేస్తున్నట్లు తెలిసింది.

ప్రభుత్వం పంపిణీ చేయనున్న చీరలు సెప్టెంబర్​చివరి కల్లా రెడీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది. అప్పటి కల్లా తయారీ ప్రక్రియ పూర్తవుతుందని ఆఫీసర్లు చెబుతున్నారు. చీరల తయారీ కోసం బీసీ సంక్షేమ శాఖ ఇప్పటికే రూ.318 కోట్లు విడుదల చేసింది. చీరల డిజైన్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ఖరారు చేశారు. ఈ సారి దసరాకు.. లేదా ప్రభుత్వం నిర్ణయించే మరో తేదీలో చీరలను పంపిణీ చేయనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -