Monday, November 24, 2025
E-PAPER
Homeజిల్లాలురుద్రారంలో చీరల పంపిణీ..

రుద్రారంలో చీరల పంపిణీ..

- Advertisement -

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బడితేల రాజయ్య
నవతెలంగాణ – మల్హర్ రావు

తెలంగాణ ఆడపడుచులకు సారేగా ప్రభుత్వం ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్నీ చేపట్టిందని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బడితేల రాజయ్య అన్నారు. రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు ఆదేశాల మేరకు సోమవారం మండలంలోని రుద్రారం గ్రామంలో స్వయం సహాయక మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమాన్నీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మహిళలకు గౌరవంతోపాటు సంప్రదాయాన్ని బలపరిచే ప్రయత్నంలో భాగంగా ఆడపడుచులకు సారేగా చీరల పంపిణీ ప్రభుత్వం చేస్తోందన్నారు. అర్హులైన ప్రతి మహిళకు చిరల పంపిణీ జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి  స్వామి, సింగిల్ విండో డైరెక్టర్ సంగ్గే రమేష్, కాంగ్రెస్ నాయకులు, స్వయం సహాయక మహిళలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -