Saturday, September 20, 2025
E-PAPER
Homeజిల్లాలుఅంగన్వాడి సిబ్బందికి చీరలు అందజేత

అంగన్వాడి సిబ్బందికి చీరలు అందజేత

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన అంగన్వాడి ఉద్యోగులకు చీరలను అందజేశారు. శ్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడి ఉద్యోగులకు నూతనంగా సరఫరా జరిగిన డ్రెస్ కోడ్ చీరలను పంపిణీ చేశారు. ఈ మేరకు శనివారం మండల కేంద్రంలో జరిగిన మండల సెక్టార్ సమావేశంలో ఐసిడిఎస్ మండల పర్యవేక్షకురాలు గంగా హంస చేతుల మీదుగా అంగన్వాడీ టీచర్లకు అంగన్వాడి ఉద్యోగుల డ్రెస్ కోడ్ చీరలను అందజేశారు. ఒక్కో  అంగన్వాడి టీచర్, ఆయాకు రెండు జతల చొప్పున డ్రెస్ కోడ్ చీరలను అందించినట్లు ఈ సందర్భంగా పర్యవేక్షకురాలు గంగా హంస తెలిపారు. మండలంలోని 42 మంది టీచర్ల, ఆయాలకు రెండు జతలు చొప్పున చీరలను అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో  అంగన్వాడి టీచర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ భీంగల్  ప్రాజెక్టు ఉపాధ్యక్షురాలు యమున, మండల అధ్యక్షురాలు మంజుల, అంగన్వాడి టీచర్లు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -