నవతెలంగాణ – కంఠేశ్వర్
లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ ఆద్వర్యంలో డిచ్‌పల్లి 7వ బెటాలియన్ 1995 బ్యాచ్ కానిస్టేబుళ్ళ సహకారంతో సోమవారం నిజామాబాదు నగరంలోని గుర్బాబాది ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లయన్స్ జిల్లా చైర్ పర్సన్ జిల్కర్ విజయానంద్ మాట్లాడుతూ విద్యార్థులు చిన్నతనం నుంచే క్రమశిక్షణ అలవర్చుకోవాలన్నారు. క్రమశిక్షణతో జీవితంలో దేనినైనా సాదించవచ్చన్నారు.డిచ్‌పల్లి ఏడవ పోలీసు బెటాలియన్ 1995 బ్యాచ్ కానిస్టేబుళ్ళు
అనేక సేవా కార్యక్రమాలు చేపడుతుండడంఅభినందనీయమన్నారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ అధ్యక్ష కార్యదర్శులు అబ్బాయి లింబాద్రి,పి.రాఘవేందర్, డిచ్‌పల్లి ఏడవ బెటాలియన్ 1995 బ్యాచ్ కానిస్టేబుళ్లు, గుత్పే కిరణ్, కైలాస్ పవర్,పాఠశాల ప్రధానోపాద్యాయులు చిన్నయ్య స్వామి ,ఉపాద్యాయురాలు శ్రీవాణి,లయన్స్ ప్రతినిధులు లావణ్య, జిల్కర్ నయన్ పాల్గొన్నారు.