నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : భువనగిరి మండలంలోని అనంతారం గ్రామంలో ఓల్డ్ స్టూడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం 130 మంది విద్యార్థులకు సుమారు 50 వేల రూపాయల విలువగల షూ లను పంపిణీ చేసినట్లు ఓల్డ్ స్టూడెంట్ అసోసియేషన్ అధ్యక్షులు పక్కీరు కొండల్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనంతారం పాఠశాలలో ఎండి సలీం, పకీరు కొండల్ రెడ్డి, పల్లెపాటి రాజలింగం సౌజన్యంతో విద్యార్థినీ విద్యార్థులకు 130 మందికి సుమారు 50 వేల రూపాయల విలువ గల షూ పంపిణీ చేశామని తెలిపారు. ఈ ఈ సందర్భంగా ఎండి సలీం మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో వసతులు ఏర్పాటు చేస్తా ము అన్నారు. కార్యక్రమానికి ఓల్డ్ స్టూడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు పకీరు కొండల్, ప్రధానోపాధ్యాయులు రంగరాజన్ , కొత్తపెళ్లి బాలకిషన్, ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
విద్యార్థులకు షూల పంపిణీ…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES