నవతెలంగాణ – మోర్తాడ్
మండలం పాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఉచితంగా 65 జతల స్పోర్ట్స్ పంపిణీ శనివారం జరిగింది. పాలెం గ్రామానికి చెందిన ఎనిగందుల సాయినాథ్ 30 వేల రూపాయల విలువగల 65 జతల స్పోర్ట్స్ డేస్ లను క్రీడ విద్యార్థులకు అందజేశారు. పాలెం గ్రామానికి చెందిన సాయినాథ్ అమెరికాలో ఉపాధ్యాయ వ్యతిలో కొనసాగుతున్నాడు . సొంత గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సౌకర్యార్థం ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం గొప్పతనమని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వేణుగోపాల్ రావు అన్నారు. విద్యార్థులకు స్పోర్ట్స్ డేస్ అందించిన సాయినాధుని పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులతో మహేష్ కుమార్, నరసింహస్వామి, రాజేందర్, త్రివేణి ,మమత, రాజేశ్వరి ,నచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు స్పోర్ట్స్ డేస్ పంపిణీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES