Monday, January 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సాఫ్ట్ బాల్ క్రీడాకారులకు క్రీడా సామాగ్రి వితరణ

సాఫ్ట్ బాల్ క్రీడాకారులకు క్రీడా సామాగ్రి వితరణ

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండల కేంద్రంలో సోమవారం గ్రామ సాఫ్ట్ బాల్ క్రీడాకారులకు రూ.10వేల విలువ చేసే క్రీడా సామాగ్రిని కమ్మర్ పల్లి వాస్తవ్యుడు, తపస్ ఉపాధ్యాయ సంఘం మండల అధ్యక్షుడు, ఉప్లూర్ జిల్లా పరిషత్  ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు సల్లూరి కిషన్ గౌడ్ అందజేశాడు. నిర్మల్ జిల్లా బోథ్ లో ఎస్ఐ గా పనిచేస్తున్న తన కొడుకు సల్లూరి శ్రీ సాయి  పుట్టినరోజును పురస్కరించుకొని ఉపాధ్యాయుడు సల్లూరి కిషన్ గౌడ్, సాఫ్ట్ బాల్ క్రీడ సామగ్రిని వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 

కమ్మర్ పల్లి గ్రామంలో క్రీడలను ప్రోత్సహించడానికి తనవంతుగా సాఫ్ట్ బాల్ క్రీడా సామాగ్రిని అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిశాంత్, సాగర్, సాఫ్ట్ బాల్ కోచ్ రాహుల్, గ్రామ క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -