Friday, February 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యార్థులకు క్రీడా దుస్తుల వితరణ

విద్యార్థులకు క్రీడా దుస్తుల వితరణ

- Advertisement -

నవతెలంగాణ – రాయపోల్
రాయపోల్ పాఠశాల విద్యార్థులకు అనాజీపూర్ గ్రామానికి చెందిన కానిస్టేబుల్ ఎం. స్వామి క్రీడా దుస్తులను అందజేయడం జరిగిందని రాయపోల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు తెలిపారు. శుక్రవారం రాయపోల్ మండల కేంద్రం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు క్రీడా దుస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులలో క్రీడా స్పూర్తిని పెంపొందించాలనే ఉద్దేశంతో కానిస్టేబుల్ స్వామి క్రీడా  దుస్తువులు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థుల అభివృద్ధికి సమాజం నుంచి ఇలాంటి సహకారం రావడం అభినందనీయమన్నారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ సంతోష్, గ్రామ సీనియర్ వాలీబాల్ క్రీడాకారుడు యు. స్వామి, ప్రసాద్, పాఠశాల పీడీ గోవర్ధన్ రెడ్డి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -