Wednesday, February 18, 2026
E-PAPER
Homeఖమ్మంకేజీబీవీ విద్యార్థినులకు స్టీల్ ప్లేట్లు, గ్లాసుల పంపిణీ

కేజీబీవీ విద్యార్థినులకు స్టీల్ ప్లేట్లు, గ్లాసుల పంపిణీ

- Advertisement -

నవతెలంగాణ – బోనకల్ 
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోనే బోనకల్ మండల కేంద్రంలో గల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం విద్యార్థినులకు, శాంతి నిలయంలోనే మానసిక వికలాంగులకు మండల స్పెషల్ ఆఫీసర్ కడారు విజయభాస్కర్ రెడ్డి మండల విద్యాశాఖ అధికారి దామాల పుల్లయ్య బుధవారం స్టీల్ ప్లేట్లు గ్లాసులు పంపిణీ చేశారు. గత నెల 28వ తేదీన కేజీబీవీ పాఠశాలను మండల స్పెషల్ ఆఫీసర్ ఎంఈఓ తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా వారు విద్యార్థినిలతో మాట్లాడారు. మీకు ఏమనా సమస్యలు ఉంటే  తెలపాలని వారి విద్యార్థినులను కోరారు.

దీంతో విద్యార్థినిలు తమకు భోజనం చేయటానికి స్టీల్ ప్లేట్లు గ్లాసులు లేవని అధికారులు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మండల స్పెషల్ ఆఫీసర్ స్పందిస్తూ త్వరలోనే మీ సమస్యను పరిష్కారం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

ఆ హామీ మేరకు విజయ్ భాస్కర్ రెడ్డి దామల పుల్లయ్య భోజనానికి ప్లేట్లు, తాగునీటి కోసం గ్లాసులు విద్యార్థినులకు అందజేశారు. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో 40 మంది విద్యార్థినులకు స్టీల్ ప్లేట్లు, స్టీల్ గ్లాసులు పంపిణీ చేశారు. అందులో ముగ్గురు విద్యార్థినులు అనాథలు కాగా, మిగతా 37 మంది విద్యార్థినులు సింగిల్ పేరెంట్ కుటుంబాలకు చెందినవారు. అదేవిధంగా కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయానికి పక్కనే ఉన్న శాంతి నిలయంలోనే మానసిక వికలాంగులకు కూడా విజయ్ భాస్కర్ రెడ్డి, దామాల పుల్లయ్య ప్లేట్లు, గ్లాసులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని ఉద్దేశంతోటే ప్లేట్లు, గ్లాసులు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఇష్టంతో కష్టపడి మంచిగా చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ ఇస్లావత్ సక్కుబాయి, పలువురు ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -