ఏడీఏ బాబు నాయక్..
నవతెలంగాణ- రాయపోల్
రైతులకు ప్రభుత్వం సబ్సిడీ ద్వారా విత్తనాలను పంపిణీ చేయడం జరుగుతుందని గజ్వేల్ ఏ డి ఏ బాబు నాయక్ అన్నారు. మంగళవారం రాయపోల్ మండల కేంద్రం రైతు వేదికల రైతులకు సబ్సిడీ పొద్దు తిరుగుడు విత్తనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు జాతీయ నూనె గింజల పథకం కింద పొద్దుతిరుగుడు రకం తిల్హన్ టెక్ ఎస్ యు ఎన్ హెచ్ – 1 విత్తనాల 2.50కేజీ లు సబ్సిడీ పోను రూ. 85.20 చెల్లించడం జరుగుతుందన్నారు.
అదే విధంగా జాతీయ ఆహార భద్రత పోషణ మిషన్ 2025 లో భాగంగా ఎన్ బి ఇ జి-47 అనే శనగ రకాలు అలాగే సి టి- 4260 అనే మొక్కజొన్న రకం విత్తనాలు కూడా సబ్సిడీ పై అందుబాటులో ఉన్నయని కావలసిన రైతులు పట్టాదారు పాస్ బుక్ జీరాక్స్, ఆధార్ కార్డు జీరాక్స్ తో సంబంధించిన వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించి తీసుకోవచ్చన్నారు. ప్రభుత్వం రైతులను ఆదుకునే వ్యవసాయం లాభసాటిగా చేయడానికి సబ్సిడీ ద్వారా విత్తనాలను వ్యవసాయ పనిముట్లను అందజేయడం జరుగుతుందన్నారు. ఇలాంటి అవకాశాన్ని రైతులు చదివినయం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏవో నరేష్, ఏఈవోలు ప్రవీణ్, రైతులు తదితరులు పాల్గొన్నారు.
రైతులకు సబ్సిడీ విత్తనాలు పంపిణీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES